అలర్ట్... ఎన్నికల ఫలితాల కోసం ఆ లింక్స్‌పై క్లిక్ చేయవద్దు!
- ఎన్నికల ఫలితాల పేరుతో సైబర్ దొంగలు నేరాలకు పాల్పడే అవకాశముందన్న పోలీసులు
- సోషల్ మీడియాలో వచ్చే గుర్తు తెలియని, అనుమానిత లింక్స్‌పై క్లిక్ చేయవద్దని సూచన
- హెచ్చరిక జారీ చేసిన అశ్వారావుపేట పోలీసులు
గుర్తు తెలియని లేదా అనుమానిత లింక్స్‌పై క్లిక్ చేస్తే సైబర్ నేరగాళ్లు బ్యాంకు ఖాతా సహా మనకు సంబంధించిన ఇతర వివరాలు దొంగిలించే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు. బ్యాంకులోని డబ్బును గుల్ల చేసే అవకాశాలు ఉంటాయని చెబుతున్నారు. గుర్తు తెలియని వెబ్ లింక్స్‌పై క్లిక్ చేయవద్దంటూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట పోలీసులు అలర్ట్ చేశారు.