పార్టీ ప్రధాన కార్యాలయాన్ని లైటింగ్ తో డెకరేట్ చేసిన టీడీపీ... వీడియో ఇదిగో!
- మంగళగిరిలో విద్యుత్ దీప కాంతులతో మెరిసిపోతున్న టీడీపీ ఆఫీసు
- మరి కొన్ని గంటల్లో ఏపీలో ఓట్ల లెక్కింపు ప్రారంభం
- గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తున్న టీడీపీ
ఈ నేపథ్యంలో, మంగళగిరిలోని టీడీపీ ప్రధాన కార్యాలయాన్ని రంగురంగుల విద్యుత్ దీపాలతో అందంగా ముస్తాబు చేశారు. ఎగ్జిట్ పోల్స్ లో అత్యధిక సంస్థలు టీడీపీ కూటమిదే విజయం అని చెప్పడంతో, ఆ పార్టీ మరో ఆలోచన చేయడం లేదు. ఫలితాలు వెల్లడి కాకముందే టీడీపీ కేంద్ర కార్యాలయాన్ని లైటింగ్ తో డెకరేట్ చేయడం చూస్తుంటే, గెలుపుపై ఆ పార్టీలో ఆత్మవిశ్వాసం ఏ స్థాయిలో ఉందో అర్థమవుతోంది.