ఏపీలో బస్సు బోల్తా.. మహిళ మృతి

Bus overturns in AP woman dies
ఏపీలోని పల్నాడు జిల్లాలో తులసి ట్రావెల్స్ బస్సు బోల్తా పడిన ఘటనలో ఓ మహిళ మృతి చెందారు. మరో ముగ్గురు తీవ్ర గాయాలపాలయ్యారు.  భారీ వర్షానికి రోడ్డుపై పడ్డ చెట్లను తప్పించే క్రమంలో బస్సు అదుపు తప్పి బోల్తాపడింది. మృతురాలిని విజయవాడకు చెందిన దివ్యగా గుర్తించారు. నరసరావుపేట మండలం పెట్లూరివారిపాలెంలో ఈ ఘటన చోటుచేసుకుంది. బస్సు కర్ణాటక నుంచి యానాం వెళుతుండగా ప్రమాదం జరిగింది.
Go Back to Shorts
Bus Overturns
Andhra Pradesh
Palnadu District
Road Accident

More Telugu News