గెలుపు ఎవరిది?.. కొనసాగుతున్న మహబూబ్ నగర్ స్థానిక సంస్థల ఉప ఎన్నిక కౌంటింగ్
- ఉదయం 8 గంటల నుంచి కొనసాగుతున్న కౌంటింగ్ ప్రక్రియ
- స్థానిక జూనియర్ కాలేజీలో కౌంటింగ్ కేంద్రం ఏర్పాటు
- మన్నె జీవన్‌రెడ్డి, నవీన్ కుమార్ రెడ్డి, సుదర్శన్‌గౌడ్‌లలో ఎవరు గెలవబోతున్నారనే దానిపై ఉత్కంఠ
మహబూబ్‌నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా ఉన్న కసిరెడ్డి నారాయణరెడ్డి తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కల్వకుర్తి నుంచి కాంగ్రెస్ ఎమ్మెల్యేగా గెలుపొందారు. దీంతో ఎమ్మెల్సీ పదవికి ఆయన రాజీనామా చేయడంతో అక్కడ ఉప ఎన్నిక అనివార్యమైన విషయం తెలిసిందే. కాగా కాంగ్రెస్, బీఆర్ఎస్ ఈ ఎన్నికను ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవడంతో మహబూబ్ నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా ఎవరు గెలవబోతున్నారనేది ఉత్కంఠగా మారింది. మరికొన్ని గంటల్లోనే ఈ ఉత్కంఠకు తెరపడనుంది.