తెలంగాణలో బీజేపీకే అత్యధిక సీట్లు, రెండో స్థానంలో కాంగ్రెస్: ఇండియా టీవీ ఎగ్జిట్ పోల్స్

తెలంగాణలో బీజేపీ అత్యధిక లోక్ సభ స్థానాలు గెలుచుకునే అవకాశాలు ఉన్నాయని ఇండియా టీవీ ఎగ్జిట్ పోల్ సర్వే అంచనా వేసింది. తెలంగాణలోని 17 లోక్ సభ నియోజకవర్గాల్లో బీజేపీ ప్రస్తుతం ఉన్న తన నాలుగు సీట్లను డబుల్ లేదా అంతకంటే ఎక్కువకు పెంచుకుంటుందని అంచనా వేసింది. బీజేపీ 8 నుంచి 10 సీట్లు గెలుచుకోనుందని అంచనా వేసింది. 

కాంగ్రెస్ పార్టీ 6 నుంచి 8, బీఆర్ఎస్ 0 నుంచి 1 స్థానం, మజ్లిస్ పార్టీ ఒక స్థానం గెలుచుకోవచ్చునని అంచనా వేసింది. తెలంగాణలో మొత్తం 17 లోక్ సభ స్థానాలు ఉండగా దాదాపు 16 నియోజకవర్గాల్లో ప్రధానంగా కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ అభ్యర్థులు పోటీపడ్డాయి.

BJP
Telangana
Lok Sabha Polls
Bandi Sanjay

More Telugu News