విదేశీ పర్యటన ముగించుకుని తిరిగి వచ్చిన సీఎం జగన్
- ముగిసిన పదిహేను రోజుల పర్యటన
- ప్రత్యేక విమానంలో విజయవాడ చేరుకున్న జగన్ ఫ్యామిలీ
- ఘన స్వాగతం పలికిన వైసీపీ శ్రేణులు
కాగా, విదేశీ పర్యటన ముగించుకుని వచ్చిన జగన్ నేరుగా తాడేపల్లిలోని తన నివాసానికి చేరుకున్నారు. ఈ రోజు పార్టీ నేతలతో జగన్ భేటీ కానున్నట్లు వైసీపీ వర్గాలు తెలిపాయి. ఈ నెల 4న ఓట్ల లెక్కింపు సందర్భంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై పార్టీ ముఖ్య నేతలతో ఆయన చర్చించనున్నట్లు వెల్లడించాయి. తాను విదేశీ పర్యటనలో ఉన్న ఈ పదిహేను రోజుల్లో ఆంధ్రప్రదేశ్ లో జరిగిన పరిణామాలపైనా చర్చ జరుపుతారని సమాచారం.