మోదీకి గుడి కట్టించి, గుజరాత్ వంటకం ప్రసాదంగా పెడతాను: మమతా బెనర్జీ
- మోదీ తనకు తాను దేవుడిగా భావించుకుంటే ఒక్కటే చెబుతానన్న మమతా బెనర్జీ
- మోదీగారు దయచేసి ఆలయంలో కూర్చుంటే రోజూ పూజలు చేస్తామని ఎద్దేవా
- ఇకనైనా దేశాన్ని సమస్యల్లోకి నెట్టే ప్రయత్నాలు మానుకోవాలని హితవు
దేశ ప్రయోజనాల కోసం తనను భగవంతుడు పంపించాడని మోదీ వ్యాఖ్యలు చేశారని... ఆయన తనను తాను మరో దేవుడిగా భావించుకుంటున్నాడని ఎద్దేవా చేశారు. కానీ దేవుళ్లు రాజకీయాలు చేయరని పేర్కొన్నారు.
ఆయన కనుక తనను తాను దేవుడిగా భావించుకుంటే తాను ఒక్కటే చెప్పదలుచుకున్నానని... మోదీ గారికి ఒక దేవాలయం నిర్మిస్తానని... ప్రసాదంగా గుజరాత్ ప్రత్యేక వంటకం డోక్లా పెడతానన్నారు. మోదీ గారు దయచేసి ఆలయంలో కూర్చోవాలని... రోజూ పూజలు చేస్తామని చురక అంటించారు. ఇకనైనా దేశాన్ని సమస్యల్లోకి నెట్టే ప్రయత్నాలు మానుకోవాలని హితవు పలికారు.