నితీశ్ కుమార్ జూన్ 4 తర్వాత ఎంత పెద్ద నిర్ణయమైనా తీసుకుంటారు: తేజస్వి యాదవ్
- నితీశ్ కుమార్ మరోసారి పార్టీ మారేందుకు సిద్ధంగా ఉంటారని జోస్యం
- తన పార్టీని, రాజకీయాల్లో వెనుకబడిన తరగతులను కాపాడటం కోసం ఏదైనా చేస్తాడని వ్యాఖ్య
- సార్వత్రిక ఎన్నికలకు కొన్నిరోజుల ముందు ఎన్డీయేలో చేరిన నితీశ్
నితీశ్ కుమార్ సీఎం పదవి కోసం ఐదుసార్లు కూటమిని మార్చారు. బీజేపీని కాదని ఇండియా కూటమిలో చేరిన ఆయన సార్వత్రిక ఎన్నికలకు ముందు తిరిగి ఎన్డీయే గూటికి చేరుకున్నారు. ఇటీవల ఓ సందర్భంలో నితీశ్ కుమార్ మాట్లాడుతూ... తాను పార్టీ మారడం ఇదే చివరిసారి అని, బీజేపీని వదిలేది లేదని స్పష్టం చేశారు.