కర్ణాటకలో హైదరాబాద్ బిల్డర్ దారుణ హత్య.. వెంట వెళ్లిన వారే హంతకులా?
- వ్యాపారం నిమిత్తం 24న బీదర్ వెళ్లిన బిల్డర్ కుప్పాల మధు
- వెళ్తూ తనతోపాటు చింతల్‌కు చెందిన ముగ్గురిని వెంట తీసుకెళ్లిన మధు
- హత్య తర్వాత కనిపించకుండా పోయిన ఆ ముగ్గురు
- మధు వద్ద రూ. 6 లక్షల విలువైన నగలు.. పెద్దమొత్తంలో నగదు
మరోవైపు, తర్వాతి రోజున బీదర్ జిల్లాలోని (25న) మన్నేకెళ్లి పోలీస్ స్టేషన్ పరిధిలో రోడ్డు పక్కన నిలిపి ఉంచిన కారు.. పక్కనే మృతదేహం లభ్యమైంది. కారు నంబర్ ఆధారంగా చనిపోయింది మధు అని పోలీసులు గుర్తించి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు.
మధును దుండగులు కత్తులతో పొడిచి, బండరాయితో తలపై మోది హత్య చేసినట్టు పోలీసులు గుర్తించారు. మధు ఒంటిపై రూ. 6 లక్షల విలువైన బంగారు నగలు, పెద్ద మొత్తంలో డబ్బులు ఉన్నాయని కుటుంబ సభ్యులు పేర్కొన్నారు. వాటి కోసమే నిందితులు ఆయనను హత్య చేసినట్టు భావిస్తున్నారు. మధుతో పాటు బీదర్ వెళ్లిన రేణుక ప్రసాద్, వరుణ్, లిఖిత్ సిద్దార్థ ఉన్నట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.