సీఎం జగన్ పై రాయి దాడి కేసులో నిందితుడి బెయిల్ పిటిషన్ పై తీర్పు రిజర్వ్
- ఏప్రిల్ 13న విజయవాడలో సీఎం జగన్ మేమంతా సిద్ధం బస్సు యాత్ర
- సింగ్ నగర్ వద్ద సీఎం జగన్ పై రాయితో దాడి
- సతీశ్ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్న పోలీసులు
- సతీశ్ బెయిల్ పిటిషన్ పై నేడు విజయవాడ కోర్టులో విచారణ
పోలీసులు సతీశ్ ను ఈ కేసులో అక్రమంగా ఇరికించారని అతడి తరఫు న్యాయవాది సలీం పేర్కొన్నారు. వాదనలు విన్న న్యాయమూర్తి తీర్పును రిజర్వ్ చేశారు. అనంతరం తదుపరి విచారణను రేపటికి వాయిదా వేశారు. నిందితుడి బెయిల్ పిటిషన్ తీర్పుకు సంబంధించి రేపు ఉత్తర్వులు ఇవ్వనున్నారు.