పొలంలో ఒకే రోజు రెండు వజ్రాలు లభ్యం.. కర్నూలు జిల్లాలో రైతు కూలీలకు పట్టిన అదృష్టం
- రూ.6 లక్షల నగదుతో పాటు 6 తులాల బంగారం ఇచ్చి సొంతం చేసుకున్న వ్యాపారి
- మదనంతపురంలో ఓ రైతును వరించిన అదృష్టం
- వారం రోజుల్లో పది వజ్రాలు లభ్యం.. గుట్టుచప్పుడు కాకుండా కొనుగోలు చేసిన వ్యాపారులు
మదనంతపురం గ్రామానికి చెందిన ఓ రైతుకు ఇటీవల దొరికిన ఓ వజ్రానికి స్థానిక వ్యాపారి ఏకంగా రూ.15 లక్షలు ఇచ్చి కొనుగోలు చేసినట్లు ప్రచారం జరుగుతోంది. తుగ్గలి మండలం జొన్నగిరిలో పొలం పనులు చేస్తున్న కూలీలకు చెరో వజ్రం దొరికింది. ఇందులో ఒకదానికి రూ.6 లక్షల నగదుతో పాటు 6 తులాల బంగారం ఇచ్చి స్థానిక వ్యాపారి ఒకరు కొనుగోలు చేశారు. రెండో వజ్రాన్ని ఇంకా వేలం వేయలేదని, దానికి సుమారు రూ.12 లక్షలు పలకవచ్చని స్థానిక వ్యాపారులు చెబుతున్నారు.