నన్ను ఏ పార్టీ వేదికపైనా చూడలేరు: ప్రకాశ్ రాజ్
- శనివారం చెన్నైలో వీసీకే తరపున అవార్డు ప్రదానోత్సవం - 2024 కార్యక్రమం
- కార్యక్రమంలో ప్రకాశ్ రాజ్‌కు అంబేడ్కర్ చుడర్ అవార్డు
- తాను ఏ పార్టీకి చెందిన వ్యక్తిని కాదన్న ప్రకాశ్ రాజ్
- ఎల్లప్పుడూ ప్రజల గొంతుకై ఉంటానని వ్యాఖ్య
ఈ సందర్భంగా ప్రకాశ్ రాజ్ మాట్లాడుతూ.. తనను ఏ పార్టీ వేదికపైనా చూడలేరని, ఎందుకంటే తాను ఏ పార్టీకి చెందిన వ్యక్తిని కాదన్నారు. అయితే, తాను పోరాడే సిద్ధాంతాల కోసమే వీసీకే పార్టీ, అధ్యక్షుడు తిరుమావళవన్ పోరాడుతున్నారని, ఆయన తన స్నేహితుడని చెప్పారు. తాను గత పదేళ్లుగా ప్రధాని మోదీని వ్యతిరేకిస్తున్నానని తెలిపారు. వీసీకే అధ్యక్షుడు తిరుమావళవన్ మాట్లాడుతూ.. ప్రధాని మోదీ ఓడిపోతే అన్ని సమస్యలూ పరిష్కారం అవుతాయని చెప్పలేమని, సనాతన శక్తుల వల్ల వేయి మంది మోదీలను సృష్టించవచ్చని తెలిపారు. వెట్రిమారన్, ప్రకాశ్ రాజ్, పా. రంజిత్, మారి సెల్వరాజ్ లాంటి వారు ఇంకా ఎందరో సినిమాల్లోకి రావాలని ఆకాంక్షించారు.