ఆర్వో సీల్ లేని పోస్టల్ బ్యాలెట్లపై స్పష్టత ఇచ్చిన ఈసీ
- ఆర్వో సీల్ లేని పోస్టల్ బ్యాలెట్ల చెల్లుబాటుపై అనిశ్చితి
- ఆర్వో సీల్ లేకపోయినా... ఆర్వో సంతకం ఉంటే చెల్లుబాటు అవుతాయన్న ఈసీ
- ఫారం-13ఏ లో అన్ని వివరాలు ఉండాలని స్పష్టీకరణ
- ఈ మేరకు మార్గదర్శకాలు
అయితే, ఫారం-13ఏ లో అన్ని వివరాలతో పాటు ఆర్వో సంతకం కూడా ఉండాలి... అప్పుడే చెల్లుబాటు అవుతాయని పేర్కొంది. ఒకవేళ ఫారం-13ఏ లో ఓటరు సంతకం, ఆర్వో సంతకం, బ్యాలెట్ సీరియల్ నెంబరు లేకపోతే ఆ పోస్టల్ బ్యాలెట్ ను తిరస్కరించవచ్చు అని ఈసీ వివరించింది. ఈ మేరకు మార్గదర్శకాలు జారీ చేసింది.
పోస్టల్ బ్యాలెట్ల విషయంలో ఈసీ జారీ చేసిన తాజా మార్గదర్శకాలను ఏపీ సీఈవో ముఖేశ్ కుమార్ మీనా జిల్లాల రిటర్నింగ్ అధికారులకు పంపించారు.