Ugram Veeram: ‘ఉగ్రం.. వీరం’లోని నృసింహావిర్భావ ఘట్టం ఒళ్లు గగుర్పొడుస్తుంది: చాగంటి

Puranapanda Ugram Veeram book launched on Vijayawada Kanaka Durga Temple
  • పురాణపండ శ్రీనివాస్ రచించిన ‘ఉగ్రం.. వీరం’ గ్రంథం
  • ఇంద్రకీలాద్రిపై ఆవిష్కరించిన ప్రవచనకర్త చాగంటి కోటేశ్వరరావు
  • పురాణపండ అసాధారణ ప్రతిభాశాలి అని ప్రశంస
  • అలతి అలతి పదాలతో మనసుల్ని కట్టిపేస్తుందన్న ఆలయ ఈవో కేఎస్ రామారావు

ప్రముఖ రచయిత పురాణపండ శ్రీనివాస్ రచించిన ‘ఉగ్రం.. వీరం’ గ్రంథాన్ని బెజవాడ ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మ సమక్షంలో ప్రముఖ ప్రవచనకర్త చాగంటి కోటేశ్వరరావు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘ఉగ్రం.. వీరం’ గ్రంథంలోని నృసింహావిర్భావ ఘట్టం గాథను చదివితే ఒళ్లు గగుర్పొడుస్తున్న అనుభూతి కలుగుతుందని అన్నారు. మూల రచనల్ని, తత్వశాస్త్ర, ప్రాచీన రచనలను సత్యన్వేషణతో చదివే అసాధారణ ప్రతిభాశాలి కావడం వల్లే శ్రీనివాస్ ఇంత అందంగా ఈ గ్రంథాన్ని రచించారని కొనియాడారు. ఆయన రచనా సంకలనాలు భక్త పాఠకులను సమ్మోహన పరుస్తున్నాయని, ఆయన కలంలో సర్వస్వతీ కారుణం ఉందని ప్రశంసించారు. జీవన సార్థకతకు ఇంతకుమించి ఇంకేం కావాలని ప్రశ్నించారు. 

'ఉగ్రం.. వీరం' తొలి ప్రతిని చాగంటి నుంచి దుర్గామల్లేశ్వరస్వామి దేవస్థానం జాయింట్ కమిషనర్, కార్యనిర్వహణాధికారి కేఎస్ రామారావు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ గ్రంథంలోని ప్రహ్లాద, నారసింహుల కథాకథనం అలతి అలతి పదాలతో మనసుల్ని కట్టిపడేస్తుందని పేర్కొన్నారు. అనంతరం భక్తులకు ‘ఉగ్రం..వీరం’ ప్రతులను ఉచితంగా పంపిణీ చేశారు. కాగా, ఈ గ్రంథానికి మాజీ మంత్రి, బీఆర్ఎస్ నాయకుడు పొన్నాల లక్ష్మయ్య, అరుణాదేవి దంపతులు సమర్పకులుగా వ్యవహరించారు.

  • Loading...

More Telugu News