Rahul Gandhi: రాహుల్‌, సోనియాగాంధీ వెనకున్న ఫొటో జీసస్‌ది కాదా?.. మరెందుకీ రచ్చ?

Painting Behind Sonia Gandhi And Rahul Not Of Jesus Christ
  • ఓటు హక్కు వినియోగించుకున్న తర్వాత తల్లితో కలిసి రాహుల్ సెల్ఫీ
  • వారి వెనక గోడకు కనిపించిన ఫొటో జీసస్‌దంటూ విమర్శలు
  • బ్రహ్మణుడిగా చెప్పుకునే రాహుల్ ఇంట్లో హిందూ ఫొటో లేదు ఎందుకుంటూ నెటిజన్ల ప్రశ్న
  • అది జీసస్ ఫోటో కాదని ఫ్యాక్ట్ చెక్‌లో తేలిన వైనం
  • రష్యన్ పెయింటర్ నికోలస్ రోరిచ్ చిత్రించిన ‘మడొన్నా ఒరిఫ్లామా‘ పెయింటింగ్

సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా ఆరో ఫేజ్‌లో జరిగిన పోలింగ్‌లో తల్లి సోనియాతో కలిసి ఓటుహక్కు వినియోగించుకున్న రాహుల్‌గాంధీ అందుకు సంబంధించిన సెల్ఫీని పోస్టు చేశారు. అంతవరకు బాగానే ఉన్నా.. ఆ తర్వాత ఆ ఫొటో వైరల్ అయింది. తాను జంధ్యం ధరించే బ్రాహ్మణుడినని చెప్పుకునే రాహుల్ షేర్ చేసిన ఫొటోలో వెనక గోడకు హిందూ దేవుడి ఫొటో కాకుండా జీసస్ ఫొటో తగిలించి ఉందని విమర్శలు వెల్లువెత్తాయి. ఈ ఫొటోపై రాహుల్ విపరీతంగా ట్రోల్ అయ్యారు.  

   
అయితే, రాహుల్, సోనియా సెల్ఫీ వెనకున్న గోడపై తగిలించిన ఫొటో జీసస్‌ది కాదని ఫ్యాక్ట్‌చెక్‌లో తేలింది. అది రష్యన్ పెయింటర్ నికోలస్ రోరిచ్ వేసిన ‘మడొన్నా ఒరిఫ్లామా’. ఆ పెయింటింగ్‌లోని మహిళ శాంతి జెండా పట్టుకుని ఉంది. ఇదే ఫొటోలో 2017లో ఓ బ్లాగ్‌పోస్ట్‌లోనూ కనిపించింది. రోరిచ్ దీనిని 1932లో చిత్రించారు. ఈ ఫొటోగ్రఫీని ‘బ్యానర్ ఆఫ్ పీస్’గా పిలుస్తారు. న్యూయార్క్ మ్యూజియంలోనూ ఇది కొలువై ఉంది. అయితే, అది చూడడానికి జీసస్ ఫొటోలా కనిపిస్తుండడంతో అదే నిజమని పొరపాటు పడిన ట్రోలర్లు రాహుల్‌పై విరుచుకుపడ్డారు.

  • Loading...

More Telugu News