International T20s: అంతర్జాతీయ టీ20ల్లో రోహిత్ శర్మ పరుగులను అధిగమించిన బాబర్ ఆజమ్

Babar Azam Surpasses Rohit Sharma In Elite T20Is List
  • 118 మ్యాచ్ లలో 3,987 పరుగులు చేసిన పాక్ జట్టు సారథి
  • 151 మ్యాచ్ లలో ఇప్పటివరకు 3,974 పరుగులు చేసిన ‘హిట్ మ్యాన్’
  • 4,037 పరుగులతో తొలి స్థానంలో కొనసాగుతున్న కింగ్ కోహ్లీ

పాకిస్థాన్ క్రికెట్ జట్టు సారథి బాబర్ అజమ్ మరో ఘనత నెలకొల్పాడు. అంతర్జాతీయ టీ20లలో అత్యధిక పరుగులు సాధించిన రెండో ఆటగాడిగా నిలిచాడు. ఇప్పటివరకు రెండో స్థానంలో కొనసాగుతున్న టీం ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మను అధిగమించాడు. ఇంగ్లాండ్ తో జరిగిన రెండో టీ20 మ్యాచ్ లో అతను 32 పరుగులు చేయడం ద్వారా ఈ మైలురాయిని చేరుకున్నాడు. 

రోహిత్ శర్మ 151 అంతర్జాతీయ టీ20లు ఆడి 143 ఇన్నింగ్స్ లలో 3,974 పరుగులు చేశాడు. అతని స్ట్రైక్ రేట్ 139.97గా ఉంది. బాబర్ ఆజమ్ కేవలం 118 మ్యాచ్ లలో 111 ఇన్నింగ్స్ లలోనే 3,987 పరుగులు పూర్తి చేశాడు. అయితే 4,037 పరుగులతో తొలి స్థానంలో కింగ్ కోహ్లీ కొనసాగుతున్నాడు. 

ఎడ్జ్ బాస్టన్ లో శనివారం జరిగిన మ్యాచ్ లో బాబర్ 123.08 స్ట్రైక్ రేట్ తో 26 బంతుల్లో 32 పరుగులు చేశాడు. ఇందులో నాలుగు ఫోర్లు ఉన్నాయి. అయితే అతని ఆట జట్టును గెలిపించలేకపోయింది. తొలుత బ్యాటింగ్ కు దిగిన ఇంగ్లాండ్ జట్టు 20 ఓవర్లలో ఏడు వికెట్లు కోల్పోయి 183 పరుగులు చేసింది. అయితే ఈ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో పాకిస్థాన్ 19.2 ఓవర్లలో 160 పరుగులకే ఆలౌట్ అయింది.

  • Loading...

More Telugu News