IPL 2024: ఐపీఎల్ ట్రోఫీతో ఇద్దరు కెప్టెన్ల పోజులు... ఫొటోలు ఇవిగో!

Pat Cummins and Shreyas Iyer poses with IPL Trophy in Chennai
  • మార్చి 22న ప్రారంభమైన ఐపీఎల్ 17వ సీజన్
  • రేపు మే 26న ఫైనల్ మ్యాచ్
  • ఫైనల్ చేరిన సన్ రైజర్స్, కోల్ కతా నైట్ రైడర్స్

రెండు నెలలుగా క్రికెట్ ప్రేమికులను విశేషంగా అలరిస్తున్న ఐపీఎల్ ముగింపు దశకు వచ్చింది. రేపు (మే 26) చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో ఐపీఎల్ 17వ సీజన్ ఫైనల్ మ్యాచ్ జరగనుంది. సన్ రైజర్స్ హైదరాబాద్, కోల్ కతా నైట్ రైడర్స్ ఐపీఎల్ కప్ కోసం అమీతుమీ తేల్చుకోనున్నాయి. 

ఈ నేపథ్యంలో, ఇరుజట్ల కెప్టెన్లు ఐపీఎల్ ట్రోఫీతో నేడు ఫొటోలకు పోజులిచ్చారు. సన్ రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ పాట్ కమిన్స్, కోల్ కతా నైట్ రైడర్స్ సారథి శ్రేయాస్ అయ్యర్ చెన్నై బీచ్ లో, ఇతర ప్రాంతాల్లో కప్ తో సందడి చేశారు. దీనికి సంబంధించిన ఫొటోలను ఐపీఎల్ నిర్వాహకులు సోషల్ మీడియాలో పంచుకున్నారు.

  • Loading...

More Telugu News