Special Officers: ఏపీలో హింసాత్మక ఘటనల నేపథ్యంలో... ప్రతి జిల్లాకు ప్రత్యేక పోలీసు అధికారుల నియామకం

AP DGP appoints special police officers to every district
  • ఏపీలో పోలింగ్ రోజున, ఆ తర్వాత అల్లర్లు
  • పల్నాడు, తిరుపతి, అనంతపురం జిల్లాల్లో ఘటనలు
  • జూన్ 4న ఓట్ల లెక్కింపు
  • అదనపు ఎస్పీ, డీఎస్పీ స్థాయి అధికారులను నియమిస్తూ డీజీపీ ఉత్తర్వులు

ఏపీలో పోలింగ్ రోజున, ఆ తర్వాత పలు హింసాత్మక ఘటనలు జరిగిన సంగతి తెలిసిందే. తిరుపతి, పల్నాడు, అనంతపురం జిల్లాలు అల్లర్లతో అట్టుడికాయి. ఈ నేపథ్యంలో, రాష్ట్ర ప్రభుత్వం ప్రతి జిల్లాకు ప్రత్యేక పోలీసు అధికారులను నియమించింది. 

అడిషనల్ ఎస్పీ, డీఎస్పీ స్థాయి అధికారులను నియమిస్తూ డీజీపీ హరీశ్ కుమార్ గుప్తా ఉత్తర్వులు జారీ చేశారు. మొత్తం 56 మందిని ప్రత్యేక అధికారులుగా నియమించారు. ఇవాళ సాయంత్రం లోగా ఆయా జిల్లాల ఉన్నతాధికారులకు రిపోర్ట్ చేయాలని వారిని ఆదేశించారు. సున్నిత ప్రాంతాల్లో శాంతిభద్రతల బాధ్యతలను ప్రత్యేక అధికారులకు అప్పగించాలని డీజీపీ తన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. 

కాగా, సమస్యాత్మక ప్రాంతాల్లో ఒకటిగా ఉన్న పల్నాడు జిల్లాకు 8 మంది పోలీసు అధికారులను కేటాయించారు. వారిలో ఆరుగురు అదనపు ఎస్పీలు, ఇద్దరు డీఎస్పీలు ఉన్నారు.

  • Loading...

More Telugu News