Mallu Ravi: తీన్మార్ మల్లన్నపై కేటీఆర్ వ్యాఖ్యలు... ఈసీకి ఫిర్యాదు చేస్తామన్న మల్లు రవి

Mallu Ravi says will complaints EC on KTR for allegations on teenmar mallanna
  • తీన్మార్ మల్లన్నపై కేటీఆర్ చేసిన వ్యాఖ్యలను ఖండించిన మల్లు రవి
  • తీన్మార్ మల్లన్న ఎమ్మెల్సీ అభ్యర్థిగా అర్హుడని ఈసీ తెలిపిందని వ్యాఖ్య
  • కేటీఆర్ తన వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలని డిమాండ్

తీన్మార్ మల్లన్నపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలను కాంగ్రెస్ పార్టీ నేత మల్లు రవి ఖండించారు. నల్గొండ-వరంగల్-ఖమ్మం గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో తీన్మార్ మల్లన్న కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీలో ఉన్నారు. ప్రచారంలో భాగంగా కేటీఆర్ విమర్శలు గుప్పిస్తూ, ఆయనపై కేసులు ఉన్నాయని ఆరోపించారు.

ఈ వ్యాఖ్యలకు మల్లు రవి శనివారం కౌంటర్ ఇచ్చారు. ఎమ్మెల్సీ అభ్యర్థిగా మల్లన్న అర్హుడని ఈసీ తెలిపిందన్నారు. కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై ఈసీకి ఫిర్యాదు చేస్తామన్నారు. తీన్మార్ మల్లన్నపై చేసిన వ్యాఖ్యలను కేటీఆర్ వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ఈ వ్యాఖ్యలపై ఈసీ కూడా చర్యలు తీసుకోవాలని కోరారు.

తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఆవిర్భావ ఉత్సవాలకు సోనియా గాంధీ వస్తున్నారని మల్లు రవి తెలిపారు. తెలంగాణ ఇచ్చిన నాయకురాలిగా ఆమెను ఘనంగా సన్మానిస్తామన్నారు. తెలంగాణ ఉద్యమం సమయంలో పని చేసిన అన్ని పార్టీలను ఈ ఉత్సవాలకు ఆహ్వానిస్తున్నట్లు తెలిపారు.

  • Loading...

More Telugu News