Jeevan Reddy: మతం పేరుతో బీజేపీ ప్రజల్ని రెచ్చగొడుతోంది: కాంగ్రెస్ నేత జీవన్ రెడ్డి

BJP is doing religious politics alleges Jeevan Reddy
  • బీజేపీ రిజర్వేషన్లు తొలగించే ప్రయత్నాలు చేస్తోందని విమర్శ
  • ముస్లింలను బూచిగా చూపి దేశాన్ని చీల్చే ప్రయత్నం చేస్తోందని ఆగ్రహం
  • తెలంగాణలో మెజార్టీ సీట్లు కాంగ్రెస్ గెలుచుకుంటుందని ధీమా

రిజర్వేషన్ల అంశానికి సంబంధించి బీజేపీ మీద కాంగ్రెస్ సీనియర్ నేత జీవన్ రెడ్డి తీవ్రంగా మండిపడ్డారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ... మతం పేరుతో బీజేపీ ప్రజలను రెచ్చగొడుతోందన్నారు. రిజర్వేషన్లను తొలగించే ప్రయత్నాలు చేస్తోందని, ముస్లింలను బూచిగా చూపి దేశాన్ని చీల్చే ప్రయత్నం చేస్తోందని ఆరోపించారు.

ఎస్సీ, ఎస్టీ, బీసీల గురించి మాట్లాడే హక్కు ప్రధాని మోదీకి లేదన్నారు. కేంద్రంలో ఇండియా కూటమి అధికారంలోకి వస్తే ఎస్సీ, ఎస్టీ, బీసీల హక్కులను కాపాడుతామన్నారు. తెలంగాణలో మెజార్టీ లోక్ సభ స్థానాలను కాంగ్రెస్సే గెలుచుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు. కేంద్రంలో ఇండియా కూటమి అధికారంలోకి వస్తుందని జోస్యం చెప్పారు.

  • Loading...

More Telugu News