తెలంగాణలో విద్యాసంవత్సరం క్యాలెండర్ విడుదల... జూన్ 12న స్కూల్స్ ప్రారంభం
- వచ్చే ఏడాది ఏప్రిల్ 23 వరకు పాఠశాలలు
- దసరా, క్రిస్మస్, సంక్రాంతికి సెలవులు
- ఉన్నత పాఠశాలలు ఉదయం 9.30 గంటల నుంచి సాయంత్రం 4.45 వరకు...
- అప్పర్ ప్రైమరీ పాఠశాలలు ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4.15 వరకు నిర్వహణ
అక్టోబర్ 2 నుంచి 14వ తేదీ వరకు దసరా సెలవులు, డిసెంబర్ 23 నుంచి 27 వరకు క్రిస్మస్ సెలవులు, జనవరి 13 నుంచి 17 వరకు సంక్రాంతి సెలవులు ఇచ్చారు. ఉన్నత పాఠశాలలు ఉదయం 9.30 గంటల నుంచి సాయంత్రం 4.45 వరకు, అప్పర్ ప్రైమరీ పాఠశాలలు ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4.15 వరకు నిర్వహిస్తారు.