Chandrababu: టీడీపీ కార్యకర్త శేషాద్రిపై దాడిని ఖండించిన చంద్రబాబు

Chandrababu condemns attack on TDP worker Seshadri in Kuppam constituency
  • కుప్పం నియోజకవర్గంలో 89-పెద్దూరులో ఘటన
  • టీడీపీ కార్యకర్త  శేషాద్రిపై వైసీపీ శ్రేణుల దాడి
  • ఓటమి ఖాయమని తెలియడంతో విచక్షణ కోల్పోతున్నారన్న చంద్రబాబు
  • వైసీపీ మూకల ఆటకట్టిస్తామని హెచ్చరిక 

చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గం 89-పెద్దూరులో టీడీపీ కార్యకర్త శేషాద్రిపై దాడి జరిగింది. ఈ ఘటనపై టీడీపీ అధినేత చంద్రబాబు స్పందించారు. తమ కార్యకర్త శేషాద్రిపై వైసీపీ శ్రేణుల దాడిని ఖండిస్తున్నట్టు తెలిపారు. 

ఓటమి ఖాయమని తెలియడంతో విచక్షణ కోల్పోతున్నారని చంద్రబాబు మండిపడ్డారు. అందుకే టీడీపీ కార్యకర్తలపై వైసీపీ శ్రేణులు, రౌడీలు దాడులకు పాల్పడుతున్న సంఘటనలు ఎక్కువవుతున్నాయని పేర్కొన్నారు. 

దాడులకు పాల్పడిన వారిపై పోలీసులు చర్యలు చేపట్టాలని చంద్రబాబు డిమాండ్ చేశారు. అల్లర్లు సృష్టించాలని చూస్తున్న వైసీపీ మూకల ఆటకట్టిస్తాం అని హెచ్చరించారు.

  • Loading...

More Telugu News