KTR: కేసీఆర్ దృఢసంకల్పానికి ఉదాహరణ యాదాద్రి థర్మల్ పవర్ స్టేషన్: కేటీఆర్

YTPS is a classic example of the bold vision and unmatched execution of KCR
  • యాదాద్రి ప‌వ‌ర్ స్టేష‌న్ యూనిట్ల‌లో బాయిల‌ర్ లైటప్ ప్ర‌క్రియ విజయవంతమైనందుకు ఆనందంగా ఉందన్న కేటీఆర్
  • 4 వేల మెగావాట్ల సామ‌ర్థ్యంతో రాష్ట్ర ప్ర‌భుత్వం న‌డుపుతున్న దేశంలోనే అతిపెద్ద థ‌ర్మ‌ల్ ప‌వ‌ర్ ప్లాంట్ అని వెల్లడి
  • బీఆర్ఎస్ ప్రభుత్వం పదేళ్లలో విద్యుత్ స్థాపిత సామర్థ్యాన్ని దాదాపు 20,000 మెగావాట్లకు పెంచిందన్న కేటీఆర్

కేసీఆర్ హయాంలో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన యాదాద్రి థర్మల్ పవర్ స్టేషన్ విద్యుదుత్పత్తికి సిద్ధమవుతోందని... బీఆర్ఎస్ అధినేత దృఢ సంకల్పానికి ఇదే నిదర్శనమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ఈ మేరకు ఆయన ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. నల్గొండ జిల్లా దామరచర్ల మండలం వీర్లపాలెం వద్ద నిర్మిస్తున్న ఈ ప్లాంటులో రెండు యూనిట్లలో బాయిలర్లను మండించే ప్రక్రియ (లైటప్‌) కొన్నిరోజుల క్రితం పూర్తయింది. దీంతో జెన్కో అధికారులు అక్టోబర్ 10 నాటికి 800 మెగావాట్ల సామర్థ్యం గల ఈ రెండు యూనిట్ల నుంచి విద్యుదుత్పాదన ప్రారంభించాలని నిర్ణయించారు.

ఈ నేపథ్యంలో కేటీఆర్ ట్వీట్ చేశారు. యాదాద్రి ప‌వ‌ర్ స్టేష‌న్‌లో ఒక‌టి, రెండు యూనిట్ల‌లో బాయిల‌ర్ లైటప్ ప్ర‌క్రియ విజ‌య‌వంతమైంద‌ని గ‌తవారం ఇంజినీర్లు చెప్ప‌డం ఎంతో ఆనందంగా ఉంద‌న్నారు. మొత్తం 4 వేల మెగావాట్ల  (5X400) సామ‌ర్థ్యంతో రాష్ట్ర ప్ర‌భుత్వం న‌డుపుతున్న దేశంలోనే అతిపెద్ద థ‌ర్మ‌ల్ ప‌వ‌ర్ ప్లాంట్ ఇది అన్నారు. యాదాద్రి థర్మల్ పవర్ స్టేషన్ నిర్వ‌హ‌ణ‌ను తమ ప్ర‌భుత్వం బీహెచ్ఈఎల్‌కు అప్పగించిందని తెలిపారు. ఈ ప్రాజెక్టు విలువ రూ.20,400 కోట్లు అన్నారు. 2014లో కేవ‌లం 7,770 మెగావాట్ల స్థాపిత సామర్థ్యం నుండి... బీఆర్ఎస్ ప్రభుత్వం పదేళ్లలో విద్యుత్ స్థాపిత సామర్థ్యాన్ని దాదాపు 20,000 మెగావాట్లకు పెంచిందన్నారు.

  • Loading...

More Telugu News