కేసీఆర్ దృఢసంకల్పానికి ఉదాహరణ యాదాద్రి థర్మల్ పవర్ స్టేషన్: కేటీఆర్
- యాదాద్రి పవర్ స్టేషన్ యూనిట్లలో బాయిలర్ లైటప్ ప్రక్రియ విజయవంతమైనందుకు ఆనందంగా ఉందన్న కేటీఆర్
- 4 వేల మెగావాట్ల సామర్థ్యంతో రాష్ట్ర ప్రభుత్వం నడుపుతున్న దేశంలోనే అతిపెద్ద థర్మల్ పవర్ ప్లాంట్ అని వెల్లడి
- బీఆర్ఎస్ ప్రభుత్వం పదేళ్లలో విద్యుత్ స్థాపిత సామర్థ్యాన్ని దాదాపు 20,000 మెగావాట్లకు పెంచిందన్న కేటీఆర్
ఈ నేపథ్యంలో కేటీఆర్ ట్వీట్ చేశారు. యాదాద్రి పవర్ స్టేషన్లో ఒకటి, రెండు యూనిట్లలో బాయిలర్ లైటప్ ప్రక్రియ విజయవంతమైందని గతవారం ఇంజినీర్లు చెప్పడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. మొత్తం 4 వేల మెగావాట్ల (5X400) సామర్థ్యంతో రాష్ట్ర ప్రభుత్వం నడుపుతున్న దేశంలోనే అతిపెద్ద థర్మల్ పవర్ ప్లాంట్ ఇది అన్నారు. యాదాద్రి థర్మల్ పవర్ స్టేషన్ నిర్వహణను తమ ప్రభుత్వం బీహెచ్ఈఎల్కు అప్పగించిందని తెలిపారు. ఈ ప్రాజెక్టు విలువ రూ.20,400 కోట్లు అన్నారు. 2014లో కేవలం 7,770 మెగావాట్ల స్థాపిత సామర్థ్యం నుండి... బీఆర్ఎస్ ప్రభుత్వం పదేళ్లలో విద్యుత్ స్థాపిత సామర్థ్యాన్ని దాదాపు 20,000 మెగావాట్లకు పెంచిందన్నారు.