Tirumala: తిరుమలలో కొనసాగుతున్న రద్దీ... నిండిపోయిన వైకుంఠం క్యూ కాంప్లెక్స్, నారాయణగిరి షెడ్లు

Huge rush continues in Turumala shrine
  • నేడు కూడా తిరుమలకు భారీగా భక్తుల రాక
  • టోకెన్లు లేని భక్తులకు స్వామి వారి దర్శనానికి 24 గంటల సమయం
  • బాట గంగమ్మ ఆలయం నుంచి భక్తులను క్యూ లైన్లలోకి పంపిస్తున్న అధికారులు

తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. ఇవాళ కూడా భక్తులు భారీగా తరలివచ్చారు. సర్వదర్శనం కోసం టోకెన్లు లేకుండా వచ్చిన భక్తులతో వైకుంఠం క్యూ కాంప్లెక్స్, నారాయణగిరి షెడ్లు నిండిపోయాయి. 

టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటల సమయం పడుతోంది. భక్తులను బాట గంగమ్మ ఆలయం నుంచి క్యూలైన్లలోకి అనుమతిస్తున్నారు. భక్తుల రద్దీ కారణంగా శుక్ర, శని, ఆదివారాల్లో వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు చేసిన సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News