Prashant Kishor: ప్రశాంత్ కిశోర్ బీజేపీ మనిషి: తేజస్వి యాదవ్ సంచలన ఆరోపణలు

Tejaswi Yadav calls Prashant Kishor is a BJP Agent
  • ప్రశాంత్ కిశోర్ కు బీజేపీ ఆర్థికసాయం చేస్తోందన్న తేజస్వి
  • ఎన్నికల్లో ఓడిపోతున్నామని బీజేపీకి అర్థమైందని వ్యాఖ్యలు
  • అందుకే ప్రశాంత్ కిశోర్ ను పిలిపించారని వెల్లడి
  • ఒకరి నుంచి డేటా సేకరించి మరొకరికి ఇచ్చేస్తుంటాడని ఆరోపణ

ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ ఓ బీజేపీ ఏజెంట్ అంటూ ఆర్జేడీ నేత, బీహార్ మాజీ డిప్యూటీ సీఎం తేజస్వి యాదవ్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఎన్నికల వ్యూహంలో భాగంగా ప్రశాంత్ కిశోర్ కు బీజేపీ నిధులు అందిస్తోందని ఆరోపించారు. 

సార్వత్రిక ఎన్నికల్లో మూడు, నాలుగు దశల పోలింగ్ తర్వాత ఓడిపోతున్నామన్న విషయం బీజేపీ నాయకత్వానికి అర్థమైందని... అందుకే ప్రశాంత్ కిశోర్ ను పిలిపించారని తేజస్వి యాదవ్ వ్యాఖ్యానించారు. 

"గతంలో అమిత్ షా కోరిక మేరకే ప్రశాంత్ కిశోర్ ను జేడీయూ ఉపాధ్యక్షుడిగా నియమించామని మా అంకుల్ (నితీశ్ కుమార్) చెప్పారు. ఇప్పటివరకు అమిత్ షా కానీ, ప్రశాంత్ కిశోర్ కానీ ఆ వాదనను ఖండించలేదు. అతడి రాజకీయ ప్రస్థానం ఆరంభం నుంచి బీజేపీతోనే ఉన్నాడు. అతడు ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీ నాశనం అవుతుంది. అతడు కేవలం బీజేపీ ఏజెంట్ మాత్రమే కాదు... బీజేపీ వ్యూహకర్త కూడా. అతడు వాళ్ల భావజాలాన్ని అనుసరిస్తున్నాడు. 

అతడు ప్రతి ఏటా వేర్వేరు వ్యక్తులతో పనిచేస్తుంటాడు. అతడు మీ నుంచి డేటా సేకరించి వేరొకరికి ఇచ్చేస్తుంటాడు. అతడు బీజేపీ మనిషి. బీజేపీ అతడికి ఆర్థికంగా వెన్నుదన్నుగా నిలుస్తోంది" అంటూ ప్రశాంత్ కిశోర్ పై తేజస్వి యాదవ్ విమర్శనాస్త్రాలు సంధించారు.

  • Loading...

More Telugu News