Telangana: తెలంగాణ రాష్ట్ర అవతరణ వేడుకలకు ఎన్నికల సంఘం అనుమతి

EC green signal for State Formation Day
  • జూన్ 2న సికింద్రాబాద్ పరేడ్ మైదానంలో అవతరణ వేడుకలు 
  • అనుమతి లభించిన నేపథ్యంలో సమీక్ష నిర్వహించిన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి
  •  వేడుకలకు తగిన ఏర్పాట్లు చేయాలని వివిధ శాఖలకు ఆదేశం
  • గన్ పార్కులో అమరవీరుల స్థూపం వద్ద నివాళులు అర్పించనున్న సీఎం

తెలంగాణ రాష్ట్ర దశాబ్ది అవతరణ వేడుకలకు కేంద్ర ఎన్నికల సంఘం అనుమతించింది. జూన్ 2న సికింద్రాబాద్ పరేడ్ మైదానంలో అవతరణ వేడుకలను నిర్వహించనున్నారు. ఆ రోజున ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గన్ పార్కులో అమరవీరుల స్థూపం వద్ద నివాళులు అర్పిస్తారు. అవతరణ వేడుకలకు ఈసీ నుంచి అనుమతి లభించిన నేపథ్యంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి జూన్ 2న నిర్వహించాల్సిన కార్యక్రమాలపై సమీక్ష నిర్వహించారు. వేడుకలకు తగిన ఏర్పాట్లు చేయాలని వివిధ శాఖలను ఆదేశించారు.

  • Loading...

More Telugu News