Shabbir Ali: ముస్లిం రిజర్వేషన్లపై మాట్లాడితే ప్రధాని మోదీపై పరువునష్టం దావా వేస్తా: షబ్బీర్ అలీ హెచ్చరిక

Shabbir Ali warns PM Modi over minority reservations
  • ముస్లిం రిజర్వేషన్ల అంశం ప్రస్తుతం సుప్రీంకోర్టు పరిధిలో ఉందన్న షబ్బీర్ అలీ
  • అలాంటప్పుడు ముస్లిం రిజర్వేషన్లు రద్దు చేస్తామని ఎలా చెబుతారు? అని ప్రశ్న
  • ముస్లిం రిజర్వేషన్లు మతప్రాతిపదికన ఇవ్వలేదు... పేదరికం ఆధారంగా ఇచ్చారన్న షబ్బీర్ అలీ

ప్రధాని నరేంద్రమోదీ ముస్లిం రిజర్వేషన్ల గురించి మాట్లాడితే తాను పరువునష్టం దావా వేస్తానని తెలంగాణ ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ హెచ్చరించారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ... ముస్లిం రిజర్వేషన్ల అంశం ప్రస్తుతం సుప్రీంకోర్టు పరిధిలో ఉందన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ముస్లిం రిజర్వేషన్లపై మోదీ, అమిత్ షా వ్యాఖ్యలు సరికాదన్నారు. ముస్లిం రిజర్వేషన్లు రద్దు చేస్తామని వారు ఎలా చెబుతారు? అని ప్రశ్నించారు. ముస్లింలలో అందరికీ రిజర్వేషన్లు లేవని... వెనుకబడిన వర్గాలకు మాత్రమే ఇచ్చారన్నారు.

హిందూ, ముస్లిం అంటూ ప్రజల మధ్య మోదీ చిచ్చు పెడుతున్నారన్నారు. కోర్టులో ఉన్న అంశంపై ప్రధాని మోదీ మాట్లాడటం సరికాదన్నారు. అయినా మైనార్టీ రిజర్వేషన్లు మతప్రాతిపదికన ఇవ్వలేదన్నారు. పేదరికం ఆధారంగా ఇచ్చారని తెలిపారు. ఈ రిజర్వేషన్లు ఇచ్చి కూడా రెండు దశాబ్దాలు దాటిందన్నారు. ముస్లిం రిజర్వేషన్లపై కోర్టుల ఆదేశాలు, జీవోలను ప్రధాని మోదీకి పంపిస్తున్నామన్నారు.

  • Loading...

More Telugu News