Virat Kohli: కోహ్లీ దంపతుల జాక్‌పాట్! రూ. 2.5 కోట్ల పెట్టుబడి ఒక్క రోజులోనే రూ. 10 కోట్లకు చేరిక

Virat Kohli and Anushka Sharmas investment turns into Rs 10 cr in Go Digit
  • ఇన్సూరెన్స్ సంస్థ గో డిజిట్‌లో కోహ్లీ దంపతుల పెట్టుబడి
  • ఒక్కో షేర్ రూ. 75 చొప్పున 2,66,667 షేర్లు కొనుగోలు చేసిన కోహ్లీ
  • రూ. 50 లక్షలతో 66,667 కొన్న అనుష్క
  • నిన్న ఐపీవోకు గో డిజిట్
  • ఒక్కో షేర్ ధర రూ. 300 దాటేసిన వైనం
  • పెట్టుబడికి నాలుగింతలు ఆర్జించిన కోహ్లీ-అనుష్క

గో డిజిట్ జనరల్ ఇన్సూరెన్స్‌ నిన్న స్టాక్ మార్కెట్లో దూకుడు ప్రదర్శించింది. స్టాక్ ఎక్స్‌చేంజ్‌లో లిస్ట్ అయిన వెంటనే దూసుకుపోయింది. దాని షేర్ల ధరలు ఏకంగా రూ. 300 మార్క్ దాటేశాయి. దీంతో టీమిండియా స్టార్ విరాట్ కోహ్లీ-అనుష్క పెట్టుబడులు కూడా అమాంతం పెరిగాయి. గో డిజిట్‌లో కోహ్లీ ఒక్కోటి రూ. 75 చొప్పున మొత్తం 2,66,667 షేర్లు కొనుగోలు చేశాడు. ఈ మొత్తం విలువ రూ. 2 కోట్లు. అనుష్క శర్మ రూ. 50 లక్షలతో 66,667 షేర్లు కొనుగోలు చేస్తే వాటి ధర ఇప్పుడు రూ. 2.5 కోట్లకు పెరిగింది. విరాట్ రూ. 2 కోట్లు పెట్టి కొనుగోలు చేసిన షేర్ల ధరలు రూ. 8 కోట్లు అయ్యాయి. మొత్తంగా ఇద్దరూ కలిసి రూ. 2.5 కోట్లు పెడితే ఒక్క రోజులోనే వాటి విలువ రూ. 10 కోట్లకు చేరింది. అంటే ఈ లెక్కన పెట్టిన పెట్టుబడికి నాలుగింతల ప్రతిఫలం లభించింది. 

కంపెనీకి విరాట్ కోహ్లీ బ్రాండ్ అంబాసిడర్‌గానూ ఉన్నాడు. ఐపీవోలో భాగంగా గోడిజిట్ రూ. 1,125 కోట్ల విలువైన 5.48 కోట్ల షేర్లను ఆఫర్ సేల్ కింద ఐపీవోలో భాగంగా విక్రయించింది. సెలబ్రిటీలు పెట్టుబడులు పెట్టిన సంస్థలు లిస్టింగ్‌కు రావడం ఇదే తొలిసారి.  

  • Loading...

More Telugu News