Rajasthan: రద్దీ రోడ్డుపై బైక్‌పై వేగంగా వెళుతూ జంట రొమాన్స్... ఆ తర్వాత చెవులు పట్టుకొని క్షమాపణ

Video Shows Couple Romancing On Speeding Bike In Kota
  • రాజస్థాన్‌లోని కోటలో ఘటన
  • నెట్టింట వైరల్‌గా మారిన వీడియో
  • బైక్ నెంబర్‌ను ట్రేస్ చేసి యువకుడిని అరెస్ట్ చేసిన పోలీసులు

నిత్యం జనసమూహం సంచరించే రోడ్డుపై వేగంగా వెళుతున్న బైక్ మీద ఓ జంట రొమాన్స్ చేస్తున్న వీడియో ఒకటి నెట్టింట వైరల్‌గా మారింది. ఈ ఘటన రాజస్థాన్‌లోని కోటలో చోటు చేసుకుంది. దీంతో కోట పోలీసులు ఆ జంటపై కేసు నమోదు చేసి... యువకుడిని అరెస్ట్ చేశారు. వీడియోలో... బిజీగా ఉండే రోడ్డుపై ఈ జంట బైక్ పైన వెళుతోంది. యువతి బైక్ మీద పెట్రోల్ ట్యాంక్‌పై కూర్చొని... యువకుడిని ముద్దులతో ముంచెత్తుతోంది. యువకుడు బైక్‌ను చాలా వేగంగా నడుపుతూ... ఇతర వాహనాలను ఓవర్ టేక్ చేస్తూ ప్రమాదకరస్థితిలో వెళుతున్నాడు. ఈ వీడియో నెట్టింట వైరల్ కావడంతో నెటిజన్లు ఆ జంట తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఈ ఘటన కోటలోని హెర్బల్ గార్డెన్ సమీపంలో జరిగినట్లుగా పోలీసులు భావిస్తున్నారు. బండి నెంబర్‌ ను బట్టి ఆర్టీవో నుంచి వివరాలు సేకరించిన పోలీసులు యువకుడిని అరెస్ట్ చేశారు. అతనిని కైతున్ పట్టణానికి చెందిన మహ్మద్ వాసీమ్‌గా (25) గుర్తించారు.

ఈ ఘటనపై కోట పోలీసులు ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. 'కదులుతున్న మోటార్ సైకిల్‌పై అసభ్యకరంగా ప్రదర్శించిన జంటను కోట సిటీ పోలీస్ బృందం అరెస్ట్ చేసింది. మీకు సేవ చేసేందుకు కోట సిటీ పోలీసులు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటార'ని పేర్కొంది. మరో ట్వీట్‌లో ఎఫ్ఐఅర్ నమోదు చేసినట్లు తెలిపింది. ఐపీసీ సెక్షన్ 294A కింద కేసు నమోదు చేశారు. నిందితుడు మహ్మద్ వసీం, యువతిపై పోలీసులు చట్టపరమైన చర్యలు తీసుకున్నారు. మోటార్ సైకిల్‌ను స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు... వారిద్దరి చెవులు పట్టించి క్షమాపణలు చెప్పించారు. మరోసారి ఇలాంటి తప్పు చేయమని... మరెవరూ కూడా ఇలా చేయవద్దని వారితో చెప్పించారు.

  • Loading...

More Telugu News