Groom kissing Bride: పెళ్లి వేడుకలో వధువుకు ముద్దు పెట్టిన వరుడు.. ఇరు కుటుంబాల మధ్య తన్నులాట!

UP groom kissing bride during wedding leads to fight between families
  • ఉత్తరప్రదేశ్‌లోని హాపూర్‌లో సోమవారం ఘటన
  • వధూవరుల కుటుంబసభ్యుల పరస్పర దాడులు, ఏడుగురికి తీవ్ర గాయాలు
  • బాధితులను ఆసుపత్రికి తరలించిన పోలీసులు, దాడుల్లో పాల్గొన్న వారిపై కేసు
  • వధువుకు ఇష్టం లేకపోయినా వరుడు ముద్దు
    పెట్టాడన్న బంధువులు

పెళ్లి వేదికపైనే వధువుకు వరుడు ముద్దు పెట్టడం పెద్ద వివాదానికి దారి తీసింది. పెళ్లి వేదిక కాస్తా రణరంగంగా మారింది. ఉత్తరప్రదేశ్ లో సోమవారం ఈ ఘటన వెలుగు చూసింది. ఓ వ్యక్తి తన ఇద్దరు కుమార్తెల వివాహాలను హాపూర్‌లోని అశోక్‌నగర్‌ లో ఒకే రోజు ఏర్పాటు చేశాడు. ఒక కుమార్తె వివాహం పూర్తయ్యాక రెండో కుమార్తె వివాహం ప్రారంభించారు. అయితే, వరమాల వేయడం పూర్తయిన తరువాత వరుడు, వధువుకు బహిరంగంగా ముద్దుపెట్టాడు. ఇది ఇరు కుటుంబాల మధ్య ఘర్షణకు దారి తీసింది. వధువు బంధువులు వరుడు, అతడి కుటుంబసభ్యులపై మూకుమ్మడిగా దాడి చేశారు. దీంతో, వరుడి తరపు వారు కూడా ప్రతిదాడికి దిగారు. 

ఈ ఘర్షణలో ఏకంగా ఏడుగురికి తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు గాయపడ్డ వారిని ఆసుపత్రికి తరలించారు. అయితే, తమ కుమార్తెకు ఇష్టం లేకపోయినా అందరి ముందు ముద్దు పెట్టాడని వధువు కుటుంబసభ్యులు ఆరోపించారు. వధువు అనుమతి తీసుకున్నాకే ముద్దు పెట్టానని వరుడు చెప్పాడు. అయితే, ఈ ఘటనపై తమకు రాత పూర్వకంగా ఫిర్యాదు అందలేదని పోలీసులు తెలిపారు. బహిరంగంగా దాడులకు దిగిన వారిపై కేసు నమోదు చేశామని పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News