Chandrababu: ఎవరెస్ట్ ఎక్కిన ఉపేంద్ర మనల్ని గర్వపడేలా చేశాడు: చంద్రబాబు

Chandrababu tweets about Anantapur youth Upendra who scaled Mount Everest
  • ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించిన అనంతపురం కుర్రాడు
  • ఉపేంద్ర పేద మత్స్యకార కుటుంబానికి చెందినవాడన్న చంద్రబాబు
  • తెలుగు యువత ఘనతలు ఎల్లప్పుడూ సంతోషాన్ని కలిగిస్తాయని వ్యాఖ్య 

విదేశీ పర్యటనలో ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబు ఆసక్తికర ట్వీట్ చేశారు. అనంతపురం జిల్లాకు చెందిన ఉపేంద్ర ఓ పేద మత్స్యకార కుటుంబానికి చెందినవాడని, ఇటీవలే ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించాడని కొనియాడారు. 

తన అసాధారణ ఘనతతో అందరినీ గర్వపడేలా చేశాడని అభినందించారు. తెలుగు యువత తమ కలలను సాకారం చేసుకునే దిశగా ముందుకు సాగుతుండడం ఎల్లప్పుడూ సంతోషాన్ని కలిగిస్తుందని చంద్రబాబు పేర్కొన్నారు. 

కాగా, అనంతపురం యువకుడు ఉపేంద్ర ఎవరెస్ట్ శిఖరంపై చంద్రబాబు, యువగళం, చంద్రబాబు-నారా భువనేశ్వరి-నారా లోకేశ్-బ్రాహ్మణి-దేవాన్ష్ ల ఫొటోలు, బ్యానర్లను ప్రదర్శించారు. దీనికి సంబంధించిన ఫొటోలను కూడా చంద్రబాబు సోషల్ మీడియాలో పంచుకున్నారు.

  • Loading...

More Telugu News