Chhattisgarh: ఛత్తీస్ గఢ్ లో మరోసారి భారీ ఎన్ కౌంటర్... ఏడుగురు నక్సల్స్ మృతి

Seven maoists killed in Chhattisgarh encounter
  • దండకారణ్యంలో మావోల కీలక సమావేశం!
  • దంతేవాడ-బీజాపూర్ సరిహద్దుల్లో కూంబింగ్ చేపట్టిన భద్రతా బలగాలు
  • కాల్పులు జరిపిన మావోలు... దీటుగా స్పందించిన భద్రతా బలగాలు

ఛత్తీస్ గఢ్ లో మరోసారి భారీ ఎన్ కౌంటర్ జరిగింది. గత రెండు నెలల వ్యవధిలో ఛత్తీస్ గఢ్ లో జరిగిన మూడో ఎన్ కౌంటర్ ఇది. ఈ ఎదురుకాల్పుల్లో ఏడుగురు నక్సల్స్ మృతి చెందారు. 12 మందికి పైగా మావోయిస్టులు గాయపడినట్టు తెలుస్తోంది. 

దండకారణ్యంలో మావోయిస్టులు కీలక సమావేశం నిర్వహిస్తున్నారన్న సమాచారంతో భద్రతా బలగాలు రంగంలోకి దిగాయి. దంతేవాడ-బీజాపూర్ సరిహద్దుల్లో భద్రతా బలగాలు కూంబింగ్ చేస్తుండగా, మావోలు కాల్పులు జరిపారు. భద్రతా బలగాలు కూడా దీటుగా స్పందించి ఎదురు కాల్పులతో బదులిచ్చాయి. ఉదయం మొదలైన ఈ ఎన్ కౌంటర్ ఇప్పటికీ కొనసాగుతున్నట్టు తెలుస్తోంది. 

కాగా, పారిపోయే ప్రయత్నంలో ఉన్న పలువురు మావోయిస్టులను భద్రతా బలగాలు అదుపులోకి తీసుకున్నట్టు సమాచారం.

  • Loading...

More Telugu News