Rahul Gandhi: చిన్నారితో సరదాగా ఆడుతూ... మెట్రో రైలులో ప్రయాణించిన రాహుల్ గాంధీ

Rahul Gandhi takes a ride in Delhi Metro
  • ఈశాన్య ఢిల్లీ లోక్ సభ నియోజకవర్గం అభ్యర్థి కన్హయ్యతో కలిసి ప్రయాణం
  • సామాన్యులతో ముచ్చటించి... సెల్ఫీలు దిగిన రాహుల్ గాంధీ
  • మెట్రో రైడ్ ఫొటోలను ఎక్స్ వేదికగా షేర్ చేసిన కాంగ్రెస్ నేత

ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ గురువారం ఢిల్లీ మెట్రో రైలులో ప్రయాణించారు. ఢిల్లీ మెట్రోలో ఆయన ప్రయాణిస్తున్న వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. మెట్రోలో ఆయన సామాన్యులతో ముచ్చటించారు. అడిగిన వారికి సెల్ఫీలు ఇచ్చారు. యువతతో మాట్లాడారు. ఓ చిన్నారితో సరదాగా ఆడుకున్నారు. యువనేతను దగ్గర నుంచి చూసిన కొంతమంది ఫొటోలు తీసుకున్నారు. 

ఈశాన్య ఢిల్లీ లోక్ సభ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న కన్హయ్య కుమార్‌తో కలిసి రాహుల్ గాంధీ మెట్రోలో ప్రయాణించారు. మంగోల్‌పురి ర్యాలీకి వెళుతున్న సమయంలో ఆయన రైల్లో ప్రయాణించారు. రాహుల్ కూడా మెట్రోలో ప్రయాణించిన ఫొటోలను ఎక్స్ వేదికగా షేర్ చేశారు.

'ఢిల్లీవాసులతో మెట్రో రైల్లో ప్రయాణించాను. తోటి ప్రయాణికులను కలుసుకుని వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నాను. ఢిల్లీలో మెట్రోను నిర్మించాలనే మా (కాంగ్రెస్) చొరవ ప్రజారవాణాకు ఎంతో సౌకర్యవంతంగా మారిందని నిరూపితమైంది. ఇందుకు చాలా సంతోషంగా ఉంద'ని ట్వీట్ చేశారు. ఢిల్లీలో ఈ నెల 25న పోలింగ్ జరగనుంది. ప్రచారం ఈరోజుతో ముగిసింది.

  • Loading...

More Telugu News