మంజుమ్మల్ బోయ్స్ నిర్మాతలకు ఇళయరాజా నోటీసులు
- గుణ సినిమాలోని ‘కన్మణి అన్బోదు కాదలన్’ పాటను కాపీ చేసిన మంజుమ్మల్ బోయ్స్ నిర్మాతలు
- అనుమతి లేకుండా తన పాటను వాడుకున్నారని పేర్కొన్న ఇళయరాజా
- రాయల్టీ చెల్లించకుండా ఉంటే చర్యలు తప్పవన్న సంగీత దర్శకుడు
గుణ సినిమాలోని ‘కణ్మని అన్బోదు కాదలన్’పాటపై చట్టపరమైన, నైతికమైన ప్రత్యేక హక్కులు తనకు మాత్రమే ఉన్నాయని ఇళయరాజా ఆ నోటీసులో పేర్కొన్నారు. అయితే తన అనుమతి లేకుండా ఈ సినిమా పాటను మంజుమ్మల్ బోయ్స్ సినిమాలో వాడుకోవడం నేరమని ఇళయరాజా తెలిపారు. ఇప్పటికైనా సదరు నిర్మాతలు తన నుంచి అనుమతి తీసుకోవాలని, రాయల్టీ చెల్లించాలని లేకుంటే చట్టపరమైన చర్యలు తీసుకుంటానని ఆ నోటీసులో పేర్కొన్నారు.