Sensex: సరికొత్త గరిష్ఠానికి సెన్సెక్స్... దూసుకుపోయిన స్టాక్ మార్కెట్లు

Sensex hits all time high
  • తొలిసారిగా 75 వేల మార్కు టచ్ చేసిన బీఎస్ఈ సెన్సెక్స్
  • 23 వేల పాయింట్లకు చేరువలో నిఫ్టీ
  • భారీగా లాభపడిన అదానీ సంస్థలు

దేశీయ స్టాక్ మార్కెట్లు నేడు  దూసుకుపోయాయి. బీఎస్ఈ సెన్సెక్స్ ఆల్ టైమ్ హై దిశగా సరికొత్త గరిష్ఠానికి ఎగబాకింది. 1.61 శాతం వృద్ధితో 75 వేల మార్కు దాటింది. అమెరికా ఫెడరల్ రిజర్వ్ నుంచి ప్రతికూల పవనాలు వీచినప్పటికీ... మెటల్, ఫార్మా రంగాలను మినహాయించి మిగిలిన అన్ని రంగాల షేర్ల కొనుగోళ్ల జోరుతో సెన్సెక్స్ తొలిసారిగా 75 వేల మార్కును టచ్ చేసింది. 

ఇవాళ్టి ట్రేడింగ్ ఆరంభంలో మిశ్రమ ఫలితాల మధ్య ఓ దశలో సెన్సెక్స్ 75,500 మార్కును చేరుకుంది. నిఫ్టీ కూడా అదే ఊపులో 22,993.60 వరకు రికార్డు స్థాయిలో దూసుకెళ్లింది. మార్కెట్ క్లోజింగ్ సమయానికి సెన్సెక్స్ 1,196.98 పాయింట్ల లాభంతో 75,418.04 వద్ద ముగిసింది. 

నిఫ్టీ 369.90 పాయింట్ల లాభంతో 22,967.70 వద్ద ముగిసింది. అదానీ ఎంటర్ ప్రైజెస్, అదానీ పోర్ట్స్, యాక్సిస్ బ్యాంక్, ఎల్ అండ్ టీ, మహీంద్రా అండ్ మహీంద్రా భారీ లాభాలు ఆర్జించగా... సన్ ఫార్మా, పవర్ గ్రిడ్ కార్ప్, హిండాల్కో, కోల్ ఇండియా, ఎన్టీపీసీ షేర్లు నష్టాల బాటలో పయనించాయి.

  • Loading...

More Telugu News