Abuse On Girl: పదో తరగతి మార్క్స్ లిస్ట్ తీసుకునేందుకు పాఠశాలకు బాలిక.. తరగతి గదిలో సహచర విద్యార్థి లైంగిక దాడి

10th Student Sexually Abused By Co Student In Andhra Pradesh
  • ఏలూరు జిల్లా మండవల్లి మండలంలో ఘటన
  • ఘటనను వీడియో తీసిన మరో నలుగురు యువకులు
  • ఆ దృశ్యాలు చూపించి బాలికపై లైంగిక వేధింపులు
  • పెద్దమొత్తంలో డిమాండ్ .. రూ. 2 లక్షలు ఇచ్చేందుకు బాధిత తల్లిదండ్రుల అంగీకారం
  • అయినా వాట్సాప్ గ్రూపుల్లో వీడియో షేరింగ్
  • అందరినీ అరెస్ట్ చేసి కటకటాల వెనక్కి పంపిన పోలీసులు

పదో తరగతి మార్క్స్ లిస్ట్ తీసుకునేందుకు పాఠశాలకు వచ్చిన ఓ బాలికపై సహచర విద్యార్థే అఘాయిత్యానికి పాల్పడ్డాడు. బలవంతంగా తరగతి గదిలోకి లాక్కెళ్లి లైంగిక దాడికి పాల్పడ్డాడు. మరో నలుగురు యువకులు ఈ ఘటనను వీడియో తీసి బెదిరింపులకు గురిచేశారు. ప్రస్తుతం అందరూ కటకటాలు లెక్కిస్తున్నారు. ఆలస్యంగా వెలుగుచూసిన ఈ ఘటన ఏలూరు జిల్లా మండవల్లి మండలంలో జరిగింది. 

పోలీసుల కథనం ప్రకారం.. మండలంలోని ఓ గ్రామానికి చెందిన బాలిక పదో తరగతి మార్కుల జాబితాను తీసుకునేందుకు స్కూలుకు వచ్చింది. ఉపాధ్యాయులు అందుబాటులో లేకపోవడంతో తిరిగి ఇంటికి వెళ్తుండగా అప్పటికే అక్కడున్న సహచర విద్యార్థి ఆమెను తరగతి గదిలోకి లాక్కెళ్లి అత్యాచారానికి ఒడిగట్టాడు. ఈ ఘటనను బాలసుబ్రహ్మణ్యం (22), చంద్రశేఖర్ (22), తేజా (19), హరికృష్ణ (19) వీడియో తీశారు. 

డబ్బులు డిమాండ్ చేసి వాట్సాప్ గ్రూపుల్లోకి
ఆ తర్వాత ఆ దృశ్యాలు చూపించి బాలికను లైంగికంగా వేధించడం మొదలుపెట్టారు. అంతేకాదు, వాటిని బాధిత బాలిక తల్లిదండ్రులకు చూపించి డబ్బులు డిమాండ్ చేశారు. రూ. 2 లక్షలు ఇస్తామని చెప్పినా, సరిపోవని, ఇంకా పెద్దమొత్తంలో కావాలని డిమాండ్ చేశారు. అక్కడితో ఆగకుండా వీడియోను వాట్సాప్ గ్రూపుల్లో షేర్ చేశారు. దీంతో బాధిత కుటుంబం పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు బాలికపై అఘాయిత్యానికి పాల్పడిన బాలుడిని అరెస్ట్ చేసి జువైనల్ హోంకు తరలించారు. వీడియో తీసిన నలుగురు యువకులను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.

  • Loading...

More Telugu News