Laxman: ప్రజలు పన్నుల రూపంలో కట్టిన డబ్బును గ్యారెంటీలు, ఉచితాల పేరుతో వృథా చేస్తున్నారు: లక్ష్మణ్

Laxman fires at government for freebies
  • హామీలను అమలు చేయకుండా రేవంత్ రెడ్డి వాయిదాలతో కాలం వెళ్లదీస్తున్నారని విమర్శ
  • కాళేశ్వరంలో జరిగిన అవినీతి, విద్యుత్ కుంభకోణంపై చర్యలు తీసుకోలేదని ఆగ్రహం
  • అసాధ్యమైన పనులు సుసాధ్యం చేసిన నాయకుడు మోదీ అన్న లక్ష్మణ్

  ప్రజలు పన్నుల రూపంలో కట్టిన డబ్బులను గ్యారెంటీలు, ఉచితాల పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం వృథా చేస్తోందని బీజేపీ రాజ్యసభ సభ్యుడు డాక్టర్ కే లక్ష్మణ్ అన్నారు. గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఉప ఎన్నికల నేపథ్యంలో భువనగిరిలో జరిగిన ఆత్మీయ సమావేశంలో ఆయన మాట్లాడుతూ... ఇచ్చిన హామీలను అమలు చేయకుండా రేవంత్ రెడ్డి వాయిదాలతో కాలం వెళ్లదీస్తున్నారని విమర్శించారు. కాళేశ్వరంలో జరిగిన అవినీతి, విద్యుత్ కుంభకోణంపై ముఖ్యమంత్రి ఎలాంటి చర్యలు తీసుకోలేదన్నారు.

అసాధ్యమైన పనులు సుసాధ్యం చేసిన నాయకుడు మన మోదీ అన్నారు. లాల్ చౌక్‌లో రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ స్వేచ్ఛగా తిరిగేలా మోదీ చేశారన్నారు. బీఆర్ఎస్ మీద వ్యతిరేకతతోనే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని పేర్కొన్నారు.  

  • Loading...

More Telugu News