Viral Video: కొమ్మలు కావాలని పెద్ద చెట్టునే పడేసింది.. ఏనుగు వైరల్​ వీడియో ఇదిగో!

elephant uproots massive tree just in seconds
  • చెట్టును తొండంతో మెల్లగా ఊపి చూసిన ఏనుగు
  • తర్వాత తన దంతాలు, తొండంతో బలమంతా ప్రయోగించి కూల్చేసిన తీరు
  • ఇన్ స్టాలో వైరల్ గా మారిన వీడియో

అక్కడో చెట్టుంది. దానికి కొమ్మలు, ఆకులు చాలా ఎత్తుగా ఉన్నాయి. అక్కడికి వచ్చిన ఓ ఏనుగుకు ఆ చెట్టు కొమ్మలు కావాల్సి వచ్చాయి. అప్పుడేం చేయాలి. మనమైతే ఏమీ చేయలేం. అదసలే ఏనుగు కదా. దానికసలే బలం ఎక్కువ. చెట్టును పట్టుకుని ఊపడం మొదలుపెట్టింది. ఆ తర్వాత తన బలమంతా ప్రయోగించింది. దీంతో కొన్ని సెకన్లలోనే అంత పెద్ద చెట్టు కూడా అడ్డంగా కూలిపోయింది.

  • దీనితో ఏనుగు మెల్లగా కూలిపడిన చెట్టు దగ్గరికి వెళ్లింది. దానికి కావాల్సిన కొమ్మలను తొండంతో తెంచుకుని తీసేసుకుంది.
  • దక్షిణాఫ్రికాలోని మలమలగమే రిజర్వ్ ఫారెస్ట్ లో జరిగిన ఈ ఘటనను కొందరు వీడియో తీసి ఇన్ స్టాలో పెట్టడంతో వైరల్ గా మారింది. దీనికి మూడు లక్షలకుపైగా లైకులు వచ్చాయి.
  • ‘వామ్మో అంత పెద్ద చెట్టును ఎంత సింపుల్ గా పడేసింది. ఏనుగుల బలమేంటో ఈ వీడియో చూస్తే తెలిసిపోతోంది’ అని కొందరు అంటే.. ‘అలాంటి చెట్టు పెరగాలంటే ఎన్నో ఏళ్లు పడుతుంది. ఏనుగేమో సింపుల్ గా కూల్చేసింది. ఇలాగైతే అడవి నాశనమైపోదా..’ అంటూ మరికొందరు కామెంట్లు పెడుతున్నారు.
  • ఇక ఏనుగులకు లేత ఆకులు తినాలని అనిపించినప్పుడు ఇలా చెట్లను కూల్చేస్తుంటాయి. ఆ ఆకులను ఇతర జంతువులు కూడా తింటాయి. అడవుల్లో ఇది కామనే..’ అని ఎవరో ఎక్స్ పర్ట్ కామెంట్ పెట్టారు.

View this post on Instagram

A post shared by MalaMala Game Reserve (@malamalagamereserve)

  • Loading...

More Telugu News