కేసీఆర్ పాలన సాక్షిగా ఇది తెలంగాణ దశాబ్ది: కేటీఆర్ ఆసక్తికర ట్వీట్
- జూన్ 2వ తేదీతో తెలంగాణ ఏర్పడి పదేళ్లు
- వేల బలిదానాలు, ఉద్యమ సేనాని దీక్షతో తెలంగాణ సాకారమైందని వెల్లడి
- అవహేళనలు ఎదుర్కొన్న గడ్డపై ఆత్మగౌరవ పతాకం ఎగురవేశామంటూ ట్వీట్
ఉద్యమ నాయకుడే ప్రజాపాలకుడిగా స్వతంత్ర భారతదేశం మునుపెన్నడూ చూడని అభివృద్ధి నమూనా ఆవిష్కారం అయిందని తెలిపారు. పల్లె, పట్నం తేడా లేకుండా ప్రగతి రథం పరుగులు తీసిందని, ఆహార ధాన్యాల ఉత్పత్తి నుంచి ఐటీ ఎగుమతుల వరకు రికార్డులు బద్దలయ్యాయని కేటీఆర్ వివరించారు. గుండెల నిండా జై తెలంగాణ నినాదం నింపుకుని గంగా జమునా తెహజీబ్ కు సాక్షీభూతంగా నిలిచామని తెలిపారు.
అవమానాలు ఎదుర్కొన్న గడ్డపైనే తెలంగాణ ఆత్మగౌరవ పతాకాన్ని ఎగురవేశామని... కేసీఆర్ పాలన సాక్షిగా ఇది తెలంగాణ దశాబ్ది... వెయ్యేళ్లయినా చెక్కుచెదరని పునాది... జై తెలంగాణ అంటూ కేటీఆర్ భావోద్వేగాలతో స్పందించారు. జూన్ 2వ తేదీతో తెలంగాణ ఏర్పడి పదేళ్లు పూర్తి కానున్న నేపథ్యంలో ఆయన ఎక్స్ లో ఈ విధంగా పోస్టు చేశారు.