2024 ఎన్నికల్లో బెస్ట్ ఫొటో ఇదే: ఆనంద్ మహీంద్రా
- నిన్న ఐదో దశ లోక్‌సభ ఎన్నికల్లో ఓటు వేసిన ఆనంద్ మహీంద్రా
- మొదటిసారి ఓటు వేసిన గిరిజనుడి ఫొటోను పంచుకున్న పారిశ్రామికవేత్త
- ప్రజాస్వామ్యానికి ఎదురులేదంటూ ఆనంద్ మహీంద్రా ట్వీట్
గ్రేట్ నికోబార్ ద్వీపంలోని దట్టమైన అడవుల్లో నివసించే షోంపెన్ తెగకు చెందిన ఏడుగురిలో ఒకరు మొదటిసారి ఓటేశారు. ప్రజాస్వామ్యానికి ఎదురులేదని, తిరుగులేని శక్తి అని ఆనంద్ మహీంద్రా రాసుకొచ్చారు. ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
అంతకుముందు నిన్నటి పోలింగ్‌లో తన ఓటు హక్కు వినియోగించుకున్న తర్వాత కూడా ఆయన ఓ ట్వీట్ చేశారు. 'మనల్ని ఎవరు పరిపాలించాలో నిర్ణయించుకునే అవకాశం. ఇది ఒక బ్లెస్సింగ్. ఈ బ్లెస్సింగ్‌ను మీరు ఎట్టిపరిస్థితుల్లోనూ పోగొట్టుకోవద్దు' అంటూ ఆనంద్ మహీంద్రా ట్వీట్ చేశారు.