ప్రజలపై పన్నుల భారం మోపి, పదవీ కాలం పెంచుకోవాలని కుట్ర: తెలంగాణ సీఎంపై దాసోజు ఫైర్
- ఎన్నికల ముందు అలవికాని హామీలిచ్చారని మండిపాటు
- వాటిని అమలు చేసేందుకు పన్నులు పెంచుతూ ప్రజల నడ్డి విరుస్తున్నారని ఆరోపణ
- భూముల మార్కెట్ ధరల సవరణ ఆలోచన సరికాదని హితవు
అవగాహనలేమి, అధికార దాహం.. రేవంత్ రెడ్డి నోటి వెంట ఆచరణలో సాధ్యం కాని హామీలను కురిపించేలా చేసిందని దాసోజు శ్రవణ్ విమర్శించారు. ప్రజలు నమ్మి అధికారం కట్టబెట్టడంతో ప్రస్తుతం ఆ హామీలను నిలబెట్టుకోవడానికి దిక్కుమాలిన ప్రణాళికలు వేస్తున్నారని ఆరోపించారు. ఇందులో భాగంగా భూముల ధరలు పెంచి ఖజానా నింపాలని అధికార యంత్రాంగాన్ని నిరంకుశంగా ఆదేశించారని మండిపడ్డారు.