కన్హయ్య కుమార్‌పై దాడి.. మురుగునీటి కాల్వలో పడిపోయిన మహిళా జర్నలిస్టు
- ఈశాన్య ఢిల్లీ లోక్ సభ స్థానం నుంచి పోటీ చేస్తున్న కాంగ్రెస్ నేత కన్హయ్య
- దేశాన్ని విభజించాలని కన్హయ్య అన్నారన్న దాడి చేసిన వ్యక్తులు
- సైన్యాన్ని ఉద్దేశించి కూడా అనుచిత వ్యాఖ్యలు చేశారని మండిపాటు
కన్హయ్య కుమార్ ఆఫీస్ నుంచి బయటకు వస్తున్న సమయంలో ఎనిమిది మంది వరకు వచ్చారు. తొలుత ఆయనకు పూలమాల వేశారు. ఆ తర్వాత ఇంకు చల్లారు. అనంతరం ఆయనపై పంచ్ లు విసిరారు. ఈ దాడిలో నలుగురు మహిళలు కూడా గాయపడ్డారు. ఓ మహిళా జర్నలిస్టు పక్కనే ఉన్న మురుగునీటి కాల్వలో పడిపోయింది. కన్హయ్యపై దాడిని కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండించింది. ఇలాంటి చర్యలను ఏ పార్టీ కూడా సమర్థించకూడదని వ్యాఖ్యానించింది.