తెలంగాణలో యుద్ధం ఇంకా మిగిలే ఉంది: కేసీఆర్ వ్యాఖ్య
- కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రంలో మరో ఉద్యమానికి శ్రీకారం చుట్టాలన్న కేసీఆర్
- ఉద్యమ శక్తులను మరోసారి పునరేకీకరణ చేసి కార్యక్షేత్రానికి రూపకల్పన చేస్తున్నట్టు వెల్లడి
- కాంగ్రెస్ పాలనలో అన్ని వర్గాలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయన్న కేసీఆర్
తెలంగాణ మలిదశ ఉద్యమంలో భావవ్యాప్తితో ఉద్యమం ఉద్ధృతమైందన్నారు. మరోసారి కవులు, కళాకారులు ఏకం కావలసిన అవసరం ఉందన్నారు. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణను ఇప్పటికే కాంగ్రెస్ ప్రభుత్వం తిరోగమనదిశగా తీసుకెళుతోందన్నారు. కర్షకులు, కార్మికులు, నిరుద్యోగులు వివిధ వర్గాలు కాంగ్రెస్ పాలనలో అనేక ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పదేళ్ల తెలంగాణలో ప్రజలకు చిన్న ఇబ్బంది కలగకుండా పాలన చేశామన్నారు.
ఈ సందర్భంగా 'సన్ ఆఫ్ సాయిల్' పుస్తక రచయిత గోసుల శ్రీనివాస్ యాదవ్‌ను కేసీఆర్ ప్రత్యేకంగా అభినందించారు. తెలంగాణ మలి దశ ఉద్యమంలో, తెలంగాణ ప్రగతిని సాధారణ శైలిలో, ప్రజలకు అర్థమయ్యేలా వివరించారన్నారు. త్వరలో ఉద్యమ రచయితలతో ఒక సమావేశం పెట్టుకుందామని, రచయితలకు అన్ని విధాలుగా తోడుగా ఉంటానని, రచయితలు ప్రజల పక్షాన ఉండాలని పిలుపునిచ్చారు.