నవ్వాలా.. ఏడ్వాలా..?: యూపీ కమెడియన్ ఆవేదన
- మోదీపై పోటీకి నామినేషన్ వేస్తే తిరస్కరించిన అధికారులు
- వారణాసి నుంచి నామినేషన్ పత్రాలు దాఖలు చేసిన 55 మంది..
- అందులో 36 మందిని తిరస్కరించిన కలెక్టర్
- ఇదేంటని ప్రశ్నిస్తూ సోషల్ మీడియాలో వీడియో రిలీజ్ చేసిన కమెడియన్
కలెక్టర్ ను కలవడానికి తన లాయర్లను కానీ, తన స్నేహితులను కానీ అనుమతించకుండా తనను మాత్రమే లోపలికి వెళ్లమన్నారని ఆరోపించారు. తన స్నేహితుడిని పోలీసులు కొట్టారని మండిపడ్డాడు. అంతకు ముందురోజు 27 నామినేషన్లు దాఖలైతే ఆ రోజు 32 నామినేషన్లు తిరస్కరణకు గురయ్యాయని, ఈ పరిస్థితి చూసి నవ్వాలో ఏడ్వాలో అర్థం కావట్లేదని రంగీలా విమర్శించాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో వారణాసి కలెక్టరేట్ కూడా స్పందించి, వివరణ ఇచ్చింది. నిబంధనల ప్రకారం లేకపోవడం వల్లే శ్యామ్ రంగీలా నామినేషన్ ను తిరస్కరించినట్లు కలెక్టర్ కార్యాలయం అధికారిక ట్విట్టర్ ఖాతాలో వివరణ ఇచ్చింది. శ్యామ్ రంగీలా సమక్షంలోనే ఆయన నామినేషన్ పత్రాలను స్క్రూటినీ చేశామని గుర్తుచేసింది. ఆయన సమర్పించిన అఫిడవిట్ అసంపూర్తిగా ఉండడం, ప్రమాణపత్రం లేకపోవడంతో నామినేషన్ తిరస్కరించడం జరిగిందని, అదే విషయాన్ని లిఖితపూర్వకంగా కూడా శ్యామ్ కు తెలియజేశామని కలెక్టర్ కార్యాలయం వివరణ ఇచ్చింది.