ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయిన పులివర్తి నాని.. చెవిరెడ్డికి ఓటమి భయం పట్టుకుందన్న అమర్ నాథ్ రెడ్డి
- తిరుపతిలోని పద్మావతి యూనివర్శిటీలో పులివర్తి నానిపై దాడి
- నానితో పాటు భద్రతా సిబ్బందికి కూడా గాయాలు
- దాడి చేసిన వారిని వెంటనే అరెస్ట్ చేయాలని అమర్ నాథ్ రెడ్డి డిమాండ్
మరోవైపు, స్విమ్స్ ఆసుపత్రిలో పులివర్తి నానిని మాజీ మంత్రి, పలమనేరు టీడీపీ అభ్యర్థి అమర్ నాథ్ రెడ్డి కలిసి, పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... నానిపై దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామని చెప్పారు. చెవిరెడ్డి కుటుంబానికి ఓటమి భయం పట్టుకుందని... అందుకే దాడులకు తెగబడ్డారని మండిపడ్డారు. పోలీసులు కూడా వైసీపీకి అనుకూలంగా ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. దాడికి పాల్పడిన వైసీపీ నేతలను వదిలేసి, టీడీపీ నేతలను ఎందుకు అరెస్ట్ చేస్తున్నారని ఆయన ప్రశ్నించారు. నానిపై దాడి చేసిన వారిని వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు.