మనీశ్ సిసోడియా జ్యుడీషియల్ కస్టడీ పొడిగింపు
- మే 30వ తేదీ వరకు జ్యుడీషియల్ కస్టడీ పొడిగింపు
- కోర్టులో వర్చువల్గా హాజరుపరిచిన విచారణ అధికారులు
- మద్యం పాలసీ కేసులో గత ఏడాది మార్చి 9న సిసోడియాను అరెస్ట్ చేసిన అధికారులు
నిందితుల్లో ఒకరైన అరుణ్ పిళ్లై చేసిన అప్పీల్ ఆధారంగా... ఢిల్లీ హైకోర్టు జారీ చేసిన ఆదేశాలకు అనుగుణంగా సిసోడియాపై ఉన్న అభియోగాలపై వాదనలను కోర్టు వాయిదా వేసింది. మద్యం పాలసీ కేసులో గత ఏడాది మార్చి 9న ఈడీ మనీశ్ సిసోడియాను అరెస్ట్ చేసింది. నాటి నుంచి తీహార్ జైల్లో జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నారు.