Balakrishna: బాలయ్య ఇంతవరకూ ఇలాంటి ఫైట్ చేయలేదట!

Balakrishna
  • సెట్స్ పై ఉన్న బాలయ్య 109వ సినిమా 
  • ఎన్నికల కారణంగా వాయిదా పడిన షూటింగ్ 
  • తదుపరి షెడ్యూల్ కి జరుగుతున్న సన్నాహాలు 
  • విలన్ గా కనిపించనున్న బాబీ డియోల్  

బాలకృష్ణ 109వ సినిమా ప్రస్తుతం సెట్స్ పై ఉంది. ఈ సినిమాకి బాబీ దర్శకత్వం వహిస్తున్నాడు. ఆల్రెడీ బాలకృష్ణ హ్యాట్రిక్ హిట్ తో ఉన్నారు. 'అఖండ' .. 'వీరసింహా రెడ్డి' .. 'భగవంత్ కేసరి' సినిమాలతో భారీ విజయాలను ఆయన తన ఖాతాలో వేసుకున్నారు. ఆ తరువాత ప్రాజెక్టుగా ఆయన చేస్తున్న ఈ సినిమా కోసం అభిమానులంతా వేయి కనులతో వెయిట్ చేస్తున్నారు. 

భారీ బడ్జెట్ తో సితార నాగవంశీ - సాయి సౌజన్య ఈ సినిమాను నిర్మిస్తున్నారు. మొదటి నుంచి కూడా ఈ సినిమాకి సంబంధించిన యాక్షన్ తాలూకు పోస్టర్లు వదులుతూ వస్తున్నారు. బాలయ్య మాస్ యాక్షన్ సీన్లు ఈ సినిమాలో పుష్కలంగా ఉంటాయనే విషయం అభిమానులకు అర్థమైపోయింది. అలాంటి ఈ సినిమా కోసం .. తదుపరి షెడ్యూల్ ను ప్లాన్ చేస్తున్నారు. 

ఎన్నికల కారణంగా బాలయ్య బిజీగా ఉండటంతో, ఈ సినిమా షూటింగుకి బ్రేక్ ఇచ్చారు. వచ్చేవారంలోగానీ .. ఆ పై వారంలోగాని ఈ షెడ్యూల్ షూటింగు మొదలవుతుందని అంటున్నారు. బాలయ్యపై ఒక భారీ యాక్షన్ సీక్వెన్స్ ను షూట్ చేయనున్నారట. ఇంత రిస్కీ ఫైట్ ను బాలయ్య ఇంతవరకూ చేయలేదని అంటున్నారు. థియేటర్లో గూస్ బంప్స్ తెప్పించే ఫైట్ ఇది అని చెబుతున్నారు. ఈ సినిమాలో ప్రతినాయకుడిగా బాబీ డియోల్ కనిపించనున్న సంగతి తెలిసిందే. 

  • Loading...

More Telugu News