చంద్రబాబు కుటుంబం నుంచి ఐదుగురు పోటీ చేస్తున్నారు: బొత్స సత్యనారాయణ
- ఓటమి భయంతో చంద్రబాబులో అసహనం పెరిగిపోయిందన్న బొత్స
- లోకేశ్ అడ్డదారుల్లో పదవులు పొందారని విమర్శ
- జగన్ టార్గెట్ 175కి 175
తమది కుటుంబ పాలన అంటున్నారని... చంద్రబాబు కుటుంబం నుంచి ఐదుగురు పోటీ చేస్తున్నారని బొత్స అన్నారు. సీఎం జగన్ ను విమర్శించేంత స్థాయి నారా లోకేశ్ కు లేదని.. అడ్డ దారిలో పదవులు పొందిన వ్యక్తి నారా లోకేశ్ అని ఎద్దేవా చేశారు. సీఎం గురించి ఒక శుంఠ నోటికొచ్చినట్టు మాట్లాడినప్పుడు... తాను ప్రధాని గురించి మాట్లాడితే తప్పేముందని ప్రశ్నించారు. సర్వేలను తాను నమ్మనని చెప్పారు. తమ అధినేత జగన్ టార్గెట్ 175కి 175 అని అన్నారు. తాను గెలిస్తే చాలని పవన్ కల్యాణ్ అనుకుంటున్నారని చెప్పారు.