బాబాయితో కలిసి పిఠాపురం ప్రజలకు అభివాదం చేసిన రామ్ చరణ్... వీడియో ఇదిగో!

  • నేడు పిఠాపురం వచ్చిన రామ్ చరణ్
  • చేబ్రోలులో పవన్ కల్యాణ్ ను కలిసిన గ్లోబల్ స్టార్
  • భారీగా తరలివచ్చిన అభిమానులు
జనసేనాని పవన్ కల్యాణ్ కు మద్దతుగా గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ఇవాళ పిఠాపురం వచ్చారు. మేనమామ అల్లు అరవింద్, తల్లి సురేఖలతో కలిసి హైదరాబాద్ నుంచి రాజమండ్రి ఎయిర్ పోర్టుకు చేరుకున్న రామ్ చరణ్... అక్కడ్నించి రోడ్డు మార్గం ద్వారా పిఠాపురం చేరుకున్నారు. పిఠాపురంలో ఆయనకు అపూర్వ స్వాగతం లభించింది. చేబ్రోలులోని పవన్ కల్యాణ్ నివాసానికి వెళ్లిన రామ్ చరణ్... అక్కడ బాబాయితో కలిసి పిఠాపురం ప్రజలకు అభివాదం చేశారు. దీనికి సంబంధించిన వీడియోను జనసేన పార్టీ పంచుకుంది.






Ram Charan
Pawan Kalyan
Pithapuram
Janasena

More Telugu News